ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు వేదికగా మోదీ ఇచ్చిన ఓ ఒక్క హామీనైనా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందా అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మోదీ సర్కార్ రాష్ట్రాలన్నింటిని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారిని ఈడీ పేరుతో అణచివేస్తున్నారని విమర్శించారు.
కానీ తెలంగాణలో బీజేపీ ఆటలు ఇక కొనసాగవని అన్నారు. భారతీయులకు మాట్లాడే హక్కు ఉందని గుర్తు.. ఆ హక్కును కేంద్రం కాలరాస్తోందని మండిపడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పొలిటికల్ టూరిస్ట్‌ల్లాగా రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రులు రాష్ట్రంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్ పర్యటనలో కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.