టాలీవుడ్ నటుడు నారా రోహిత్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో తాను వివాహం చేసుకోబోతున్నానని నారా రోహిత్ తెలియజేశారు. ప్రతినిధి 2 సినిమా హీరోయిన్ శిరీషను తాను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో హైదరాబాద్లోని నోవాటెల్ లో వీరిద్దరూ ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక త్వరలోనే వీరి వివాహం జరగనుంది.

కాగా, రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమాల పరంగా నారా రోహిత్ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తాను నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ లో ఈ హీరోకి పెద్దగా సక్సెస్ కలిసి రావడం లేదని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. వివాహం తర్వాత నారా రోహిత్ ఎప్పటిలానే సినిమాలలో నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, నారా రోహిత్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయం పైన త్వరలోనే క్లారిటీ రానుంది.