హరీష్ రావుతో టచ్‌లో ఉన్నానని తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. నిన్నటిదాకా తాను పార్టీ మారలేదని పేర్కొన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి మాట మార్చారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల అనంతరం తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వెల్లడించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

ఈ సబ్జెక్ట్ లేని కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పేనని ఇప్పుడు బాధపడుతున్నాని.. కాంగ్రెస్ పార్టీలో ఉంటే అద్దె ఇంట్లో ఉండే ఫీలింగ్ వస్తుందని మీడియాతో ముచ్చటించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మాజీ మంత్రి హరీష్ రావు గారంటే అమితమైన గౌరవం అని.. ఆయనతో టచ్‌లోనే ఉంటున్నానని సంచలన వాఖ్యలు చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి… కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు.