చీఫ్ మినిస్ట‌ర్ అంటే ఇల్లిట‌రేట్‌, ఫ్యాక్ష‌న్ మెంటాలిటీ – జగన్ పై లోకేష్ సెటైర్లు

-

చీఫ్ మినిస్ట‌ర్ అంటే ఇల్లిట‌రేట్‌, ఫ్యాక్ష‌న్ మెంటాలిటీ అంటూ జగన్ పై నారా లోకేష్ సెటైర్లు వేశారు. పోలీసు బాసులూ! నా పాద‌యాత్ర‌ ని అడ్డుకోవ‌డానికి పెట్టిన వేలాది పోలీసు బ‌ల‌గాల‌ను రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కి నియోగిస్తే.. సీఎం ఇంటి ప‌క్క‌నే అంధ ద‌ళిత యువ‌తి ఎస్తేరు రాణి బ‌తికి ఉండేదని తెలిపారు. కాట్రేనికోన మండలం చిర్రయానంలో వైసీపీ నేతల పుత్ర‌ర‌త్నాల చేతిలో ఓ బాలిక సామూహిక మాన‌భంగానికి గుర‌ య్యేది కాదన్నారు.

విశాఖ‌ప‌ట్ట‌ణంలో వివాహిత‌ గంజాయి బ్యాచ్ దాడి నుంచి త‌ప్పించుకునేది. మ‌న చీఫ్ మినిస్ట‌ర్ అంటే ఇల్లిట‌రేట్‌, ఫ్యాక్ష‌న్ మెంటాలిటీ వ‌ల్ల శాంతిభ‌ద్ర‌త‌లు అంటే అర్థం కావు. మీకేమైంది పోలీసు బాసులూ? యూపీఎస్సీలో ర్యాంకు సాధించి, ఐపీఎస్ శిక్ష‌ణ పొంది..చ‌ట్టం, రాజ్యాంగం క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసిన మీరు ప్ర‌జాధ‌నం జీతంగా తీసుకుంటూ..ప్ర‌జ‌ల ప‌న్నుల ఆదాయం నుంచి సౌక‌ర్యాలు పొందుతూ ఒక సైకో పాల‌కుడి శాడిజాన్ని సంతృప్తి ప‌ర‌చ‌డానికి నా చుట్టూ వేలాదిమంది పోలీసుల్ని మొహ‌రించారు. నేను నిబంధ‌న‌లు మీర‌ను, నా పాద‌యాత్ర ప్ర‌శాంతంగా కొన‌సాగించుకుంటాను. నా చుట్టూ పెట్టిన వేలాది మంది పోలీసుల్ని మ‌హిళ‌ల‌ ర‌క్ష‌ణకి పంపండి. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కి వినియోగించండి పోలీసు దొర‌లూ అంటూ జగన్‌ సర్కార్‌ పై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version