ఎట్టకేలకు తన ప్రియుడిని పరిచయం చేసిన ప్రముఖ హీరోయిన్..!

-

సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయాన్ని బాహటంగానే బయటకు చెప్పేస్తుంటారు.. అలాంటి వారిలో మొన్నటికి మొన్న రకుల్ ప్రీతిసింగ్ తన ప్రియుడు ఇతడేనని జాకీ భగ్నాని గురించి చెప్పగా.. తాజాగా మరొక హీరోయిన్ కూడా తన మనసులో దాగి ఉన్న ఒక వ్యక్తి గురించి బయట పెట్టింది.. వాలెంటైన్స్ డే పురస్కరించుకొని పలువురు సినీ తారలు తాము ప్రేమిస్తున్న వ్యక్తుల ఫోటోలను సోషల్ మీడియాలో బాహటంగానే వెల్లడిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి కృతి కర్బందా కూడా ఒకరు.

గతంలో ఒక హీరోతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు గుసగుసలు రాగా వాటిని నిజం చేస్తూ ..ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట మరింత వైరల్ గా మారింది. నటి కృతి కర్బందా 2009లో బోనీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త వంటి సినిమాలలో నటించింది.. వీటితో పాటు పలు కన్నడ చిత్రాలలో కూడా నటించిన ఈమెకు తెలుగులో కన్నా కన్నడలోనే ఎక్కువగా ఆదరణ లభించింది. దాంతో అక్కడ స్టార్ హీరోయిన్గా హోదాను సంపాదించుకుంది.

ఆ తర్వాత 2016లో తెలుగులో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో హీరోకి సోదరిగా కూడా నటించింది. అయితే ఇక్కడ కూడా పరాజయం లభించింది.. ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ నటుడు పులికిత్ సామ్రాట్ తో రిలేషన్ లో ఉన్నట్లు స్పష్టం చేసింది. గతంలో పులకిత్ కి వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికే విడిపోయారు. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. కాబట్టి త్వరలోనే ఈ జంట కూడా వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version