తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని కుల దోస్తామని, పేదలను దోచుకున్న వారిని వదిలేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో… నాలుగు దిక్కుల నుంచి చిన్న చీకట్లు ముసురుకుంటాయో అలాంటి సమయంలోనే కమలం వికసిస్తుందని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
కష్టకాలంలో బిజెపి పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదని తెలిపారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలి ఎవరికి సీటు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాలని ఆశ్రయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ.
టీఆర్ఎస్ పార్టీకి ప్రధాని మోడీ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఫ్యామిలీ కాదు..పీపుల్స్ ఫస్ట్ అంటూ కేసీఆర్ కు చురకలు అంటించారు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పేరు ఎత్తకుండానే ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కమలం వికసిస్తుంది.. మొదట్లో బీజేపీకి రెండు ఎంపీ సీట్లు వస్తే అందులో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారని గుర్తు చేశారు ప్రధాని మోడీ.