నరేష్ నాలుగు పెళ్లిళ్ల సంగతులివే..

-

గత కొన్నాళ్ల నుంచి నరేష్ పవిత్ర లోకేష్ తరచు వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని నరేష్ మూడో భార్య కొంత కాలం క్రితం గొడవ చేసిన సంగతి కూడా తెలిసిందే అయితే తాజాగా ఈ విషయాలన్నీటికి చెప్పి పెడుతూ సోషల్ మీడియా వేదిక వీరిద్దరూ బంధాన్ని వెల్లడించారు..

 

నటి పవిత్ర లోకేష్ నరేష్ లో కొత్త ఏడాది సందర్భంగా అభిమానులకు షాక్ ఇచ్చారని చెప్పాలి తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమైన నరేష్ తను పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు అంతేకాకుండా ఈ వీడియోలో వీరిద్దరూ ఒకటి అవుతున్నామని ఉద్దేశం వచ్చేలా లిప్ లాక్ కూడా ఇచ్చి చూసిన వారికి మతి పోగొట్టారు..

 

మొదటి నుంచి వీరిద్దరూ వివాదాల్లో నిలుస్తూనేతోనే వస్తున్నారు.. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయంలో నరేష్-పవిత్ర జంటగా పూజలు నిర్వహించారు. వివాహం చేసుకున్న ఈ జంట దైవదర్శనం చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను నరేష్ ఖండించాడు.. అలాగే ఈ వార్తలపై స్పందించిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సైతం పెద్ద రచ్చ చేశారు నాకు చట్టబద్దంగా విడాకులు ఇవ్వకుండానే.. మరో మహిళతో ఎలా సంబంధం పెట్టుకుంటాడంటూ ఆరోపణలు చేశారు. మైసూర్ హోటల్ గదిలో ఉన్న నరేష్, పవిత్రలపై రమ్య దాడికి ప్రయత్నం చేశారు. ఈ ట్రయాంగిల్ డ్రామా పతాక శీర్షికలకు ఎక్కింది. వివాహం చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు.. ఈ సందర్భంగా నరేష్ కు ముందు జరిగిన మూడు పెళ్లిళ్ల విషయం మరొకసారి తెరపైకి వచ్చింది దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి..

ఓ ఇంటర్వ్యూలో నరేష్ స్వయంగా తన మూడు వివాహాల గురించి వివరణ ఇచ్చారు. 17 ఏళ్లకే హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టాను. 19 ఏళ్లకు పెద్దలు నాకు పెళ్లి చేశారు. అంటే దాదాపు బాల్య వివాహం. ఆ వయసులో నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. ఆమెకు అనారోగ్యం అందుకే విడిపోవాల్సి వచ్చింది. తర్వాత రెండో వివాహం చేసుకున్నాను. మనస్పర్థలతో విడిపోయాము. మూడో భార్యతో కూడా విభేదాలతో విడిపోవాల్సి వచ్చింది. ఇలా విడిపోవడంలో తప్ప ఎవరిది అంటే ఎవర్ని నిందించలేము ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఇలాంటివి వినిపిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి దగ్గర విభేదాలతో విడిపోయేవారు కనిపిస్తూనే వస్తున్నారు.. అంటూ చెప్పుకొచ్చాడు నరేష్..

అలాగే నరేష్ మొదటి వివాహం సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను చేసుకున్నాడు. వీరికి ఒక అబ్బాయి. అతనే నవీన్ విజయ కృష్ణ. ఇతడు ఎడిటర్, హీరోగా కూడా ఓ మూవీ చేశాడు. మొదటి భార్యతో విడాకులు అనంతరం దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలిని వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. తర్వత కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీరారెడ్డి తమ్ముడు కూతురు రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం రమ్య రఘుపతితో నరేష్ విడిపోయారు. ప్రస్తుతం నాలుగో పెళ్లిగా పవిత్ర లోకేష్ ను చేసుకోబోతున్నాడు నరేష్..

Read more RELATED
Recommended to you

Exit mobile version