నరేష్ మూడవ భార్యకు డబ్బు ఆశ చూపించబోతున్నాడా..?

-

తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి కి డబ్బు ఆశ చూపించబోతున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే.. మరోసారి నరేష్ , పవిత్ర లోకేష్ ను నాలుగవ వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రమ్య రఘుపతి కి విడాకులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే చిత్ర పరిశ్రమలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న పవిత్రలోకేష్ ఈయనతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే వీరి రిలేషన్ ను అధికారికంగా ప్రకటిస్తూ త్వరలోనే తమ పెళ్లి చేసుకోబోతున్నామని లిప్ కిస్ తో కూడిన ఒక వీడియోని షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

దీంతో వీరిద్దరి పెళ్లి కన్ఫర్మ్ అయినట్లే అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నరేష్ మూడవ భార్యకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ పెద్ద వివాదం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికీ విడాకులు కూడా పూర్తయినట్లు భరణం కింద కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ప్రముఖ నిర్మాత.. నరేష్ కి ఎంతో సన్నిహితంగా ఉండే చిట్టిబాబు స్పందించారు. చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” రమ్య, నరేష్ విడాకుల విషయం కోర్టులో పూర్తయింది.

ఆమెకు భరణం కింద ఎంత ఇవ్వాల్సి వచ్చినా తాను ఇస్తానని నరేష్ తెలిపాడు.. నరేష్ కు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి.. తల్లి విజయనిర్మల నుంచి ఈయనకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చాయి. అందుకే తాను కోట్లల్లో భరణం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపినట్లు చిట్టిబాబు తెలిపారు. ఈ క్రమంలోనే రమ్య రఘుపతి కుమారుడికి నరేష్ తల్లి ఇచ్చిన ఆస్తిలో వాటా ఉంటుందని, నరేష్ కష్టార్జితం విషయంలో అలా ఉండదని తెలిపారు..” మొత్తానికైతే నరేష్ మాత్రం రమ్యకి భారీగానే భరణం చెల్లిస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version