రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన చిత్రం ధమాకా.నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా విడుదల అయిన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తూ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రవితేజ కు 100 కోట్ల హీరోగా నిలబడాలనుకున్న తన కల సాకారం కాబోతుంది
రీసెంట్ గా తన ధమాకా సినిమా వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది.. తాజాగా నైజాం ఏరియా లో లో 10 వ రోజు 2 కోట్ల రూపాయల కి పైగా షేర్ ను సొంతం చేసుకుంది. మొత్తం గా 10 రోజులకు నైజాం లో ఈ చిత్రం 12.5 కోట్ల రూపాయల కి పైగా భారీ వసూళ్లను రాబట్టి స్టార్ హీరోల సరసన నిలబడేలా చేసింది.
సినిమా 10 రోజులు గడిచినా కూడా ఎక్కడా తగ్గకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఇక 11 రోజులకి అయితే ధమాకా చిత్రం మొత్తం 94 కోట్ల రూపాయల గ్రాస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం రేపు గాని ఎల్లుండి గాని 100 కోట్ల మార్క్ కొడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీనితో రవితేజ అభిమానుల సొంతంగా కష్టపడి పైకి వచ్చిన రియల్ హీరో కు అద్బుత విజయం దక్కిందని సంబరాలు చేసుకుంటున్నారు.