నాలుగో పెళ్లిపై స్పందించిన నరేష్

-

సీనియర్ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ కావడంతో ఈ పెళ్లిళ్ల తంతుపై నరేష్ స్పందించారు. ఏంటి సార్ ఏకంగా నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నారట అని మీడియా మిత్రులు అడగడంతో.. ఏ సినిమా వాళ్లే పెళ్లల్లు చేసుకుంటున్నారా? మిగతా వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవడం లేదా? అంటూ స్పందించారు.

” సినిమా వాళ్లే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అని అంటున్నారు.. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. మిగిలిన వాళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న కనిపించరు. పెళ్లిళ్లు అనేది ఆట కాదు. పెళ్లిళ్లు అంటే లైఫ్. ఆ లైఫ్ లో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప వేరే పెళ్లి నిర్ణయానికి రారు. భార్యాభర్తల మధ్య సర్దుకోవడం అనేది లేకపోతే పెళ్లి చేసుకోవడం వేస్ట్. ఇంతకు ముందు ఫ్యామిలీ కోర్ట్ ఒకటే ఉండేది. కానీ ఇప్పుడు ఎనిమిది ఫ్యామిలీ కోర్టులు వచ్చాయి. అంటే సినిమా వాళ్లే పెళ్లిల్లు చేసుకుంటున్నారా? మిగతా వాళ్లు చేసుకోవడం లేదా? అని అన్నారు నరేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version