కరోనా వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ ధరను భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రభుత్వానికి రూ. 325కు, ప్రైవేట్ మార్కెటుల్లో రూ. 800 కు విక్రయించాలని నిర్ణయించింది.
కాగా ఇండియాలో తొలి నాసల్ వ్యాక్సిన్ ఇదే. దీనికి ‘ఇన్కోవాక్’ అని పేరు పెట్టారు. జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్ళు నిండిన వారికి ముక్కు ద్వారా ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.