కేరళలో ఫుట్‌ బాల్‌ టోర్నమెంట్‌ బెస్ట్‌ ప్లేయర్‌కు ఉచితంగా పెట్రోల్‌.. పెరుగుతున్న ధరలకు నిరసన..

-

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ధర రూ.100 దాటింది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు పెరుగుతున్న ఇంధన ధరలపై పాలకులను ట్రోల్‌ చేస్తున్నారు. మరోవైపు బయట కూడా కొందరు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు.

కేరళలోని మళప్పురంలో మంగట్టుపులం ఆర్ట్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ సమీపంలో ఇలీవలే వన్డే ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. అందులో కోజికోడ్‌ టీమ్‌పై మిస్టర్‌ అనాస్‌ టీమ్‌ విజయం సాధించి ట్రోఫీని లిఫ్ట్‌ చేసింది. అయితే నిర్వాహకులు టోర్నమెంట్‌ బెస్ట్‌ ప్లేయర్‌కు 2 లీటర్ల పెట్రోల్‌ను బహుమతిగా అందజేశారు.

నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయని, సామాన్యుల గోడును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కనుకనే ఈ విధంగా పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చి నిరసన తెలుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా ఇటీవలే ఓ క్రికెట్‌ టోర్నమెంట్‌లోనూ బెస్ట్‌ ప్లేయర్‌కు ఇలాగే పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఓ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ విధంగా నిరసన చేపట్టారు. అయినా ప్రభుత్వాలు వింటే కదా. పెరుగుతున్న ధరలను భరించక తప్పదు మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version