సుప్రీం సంచలన తీర్పు.. మెరిట్‌ సాధించే బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ అభ్యర్థులు జనరల్‌ కోటా కిందకే వస్తారు..

-

రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ అభ్యర్థులకు మెరిట్‌ అభ్యర్థులతో సమానంగా మార్కులు వస్తే వారికి రిజర్వ్‌డ్‌ కేటగిరి కాకుండా జనరల్‌ కేటగిరిలో అడ్మిషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సాధారణ మార్కులతో క్వాలిఫై అయ్యే బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్‌డ్‌ కేటగిరి అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు జస్టిస్‌లు హృషికేష్‌ రాయ్‌, సంజయ్‌ కిషన్‌ కౌల్‌, దినేష్‌ మహేశ్వరిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది.

గ్రేడ్‌ 1 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్ల పోస్టుల్లో నియామకం కోసం కొందరు దరఖాస్తు చేసుకోగా వారు అడ్మిషన్లకు చెందిన తాత్కాలిక జాబితాను పరిశీలించినప్పుడు.. కొందరు అభ్యర్థులు రిజర్వేషన్‌లతో సంబంధం లేకుండా ఎంపిక చేయబడ్డారని వారు గుర్తించారు. ఈ క్రమంలో అభ్యర్థులను జనరల్‌ విభాగం కింద పరిగణించకుండా ఎంబీసీ కోటా కింద పరిగణించి నియమించారని గుర్తించారు. సాధారణ కోటాకు బదులుగా ఎంబీసీ/డీఎన్‌సీ కోటాకు వ్యతిరేకంగా ఇతర అభ్యర్థులను నియమించినందుకు ప్రతివాదులు సుప్రీంలో పిటిషన్‌ వేశారు.

ఈ క్రమంలో న్యాయమూర్తులు.. తమిళనాడు ప్రభుత్వ సేవకుల (సేవా నిబంధనలు) చట్టం, 2016 లోని సెక్షన్ 27 (ఎఫ్) కు సంబంధించిన అప్పీల్‌పై తీర్పునిచ్చారు. ముందుగా సాధారణ కేటగిరిలో అభ్యర్థులను సర్దుబాటు చేయాలని, తరువాత బ్యాక్ లాగ్‌ ఖాళీలను రిజర్వ్‌ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ప్రతివాదులు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పందించిన ధర్మాసనం రిజర్వేషన్‌లను అమలు చేసినప్పుడు మాత్రమే సెక్షన్‌ 27 వర్తిస్తుందని, ముందుగా మెరిట్‌ సీట్లను భర్తీ చేయాలని వ్యాఖ్యానించింది. తరువాత రిజర్వేషన్‌ కేటగిరి కోటాను భర్తీ చేయాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version