22 ఏళ్ల వయస్సు.. చేసిన స్కాం విలువ రూ.2,200కోట్లు!

-

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2,200 కోట్ల స్కాం జరగడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ స్కాం చేసింది ఏదైనా కార్పొరేట్ కంపెనీ అనుకుంటే పొరపాటే. కేవలం 22 ఏళ్ల కుర్రాడు అధిక లాభాలు ఆశచూపించి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానిక ప్రభుత్వం వెంటనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది.

విశాల్ పుకున్ (22) అనే యువకుడు 60 రోజుల్లోనే 30 శాతం అధిక లాభాలు ఇస్తామంటూ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజల నుంచి పెట్టుబడి రూపంలో డబ్బులు వసూలు చేశాడు. ఆ నగదు విలువ రూ.2,200 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఆ డబ్బుతో విశాల్ ఫార్మాసుటికల్స్, ప్రొడక్షన్, నిర్మాణరంగంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ భారీ ఆర్థిక మోసం వెలుగులోకి రావడంతో విశాల్ పుకున్, అతని స్నేహితుడు స్వప్నిల్ ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.కాగా, ఇలాంటి ఆర్థిక పరమైన మోసాలకు ప్రజలు దూరంగా ఉండాలని అస్సాం సీఎం హిమంత బిస్వశర్మ సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version