కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 40 లక్షల మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారని ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇన్ని మరణాలు సంభవించాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాగ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనా మరణాల పూర్తి వివారలను ప్రకటించడానికి ఐక్య రాజ్య సమతి ప్రయత్నం చేస్తుందని.. దీన్ని భారత ప్రభుత్వం అడ్డుకుంటుందుని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక కథనాన్ని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం పలు ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ ఎప్పుడు అబద్దాలే చెబుతాడని అన్నారు. ఇప్పుడు దేశంలో 5 లక్షల మరణాలే నమోదు అయినట్టు అందరినీ నమ్మిస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గత రెండేళ్లల్లో దాదాపు 40 లక్షల మంది కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమే అని మండిపడ్డారు. కరోనా వైరస్ కారణంగా మరణించిన 40 లక్షల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాగ ఈ రోజు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నివేదిక ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు 5,21,751 మంది కరోనా మహమ్మారి వల్ల మరణించారు.
मोदी जी ना सच बोलते हैं, ना बोलने देते हैं।
वो तो अब भी झूठ बोलते हैं कि oxygen shortage से कोई नहीं मरा!
मैंने पहले भी कहा था – कोविड में सरकार की लापरवाहियों से 5 लाख नहीं, 40 लाख भारतीयों की मौत हुई।
फ़र्ज़ निभाईये, मोदी जी – हर पीड़ित परिवार को ₹4 लाख का मुआवज़ा दीजिए। pic.twitter.com/ZYKiSK2XMJ
— Rahul Gandhi (@RahulGandhi) April 17, 2022