ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న కుంభమేళా కు ఎద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య 60 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వెల్లడించారు. మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్ర సామర్థ్యం, అభివృద్ధి పై నమ్మకం లేని వారు కుంభమేళా పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మహాశివరాత్రి లోపు 60కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ముందు అనుకున్నామని.. కానీ దానికి ముందే అంచనాలకు మించి ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని తొలుత అంచనా వేశారు. కానీ ప్రపంచం నలుమూలల నిత్యం సరాసరి కోటిన్నర మంది వరకు వస్తున్నారు. జనవరి 29న మౌని అమవాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ కి వచ్చినట్టు యూపీ ప్రభుత్వం పేర్కొంది.