తొలి విడతలో 8 మంది కేంద్ర మంత్రులు.. వారి భవిత్యమేంటో?

-

తొలివిడత లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నితిన్‌ గడ్కరీ సహా 8 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒక మాజీ గవర్నర్‌ ఈ విడత బరిలో నిలిచారు. తొలివిడతలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగ్‌పుర్‌ బరిలో నిలిచారు. మరో మంత్రి కిరణ్‌ రిజిజు అరుణాచల్‌ ప్రదేశ్‌ పశ్చిమ స్థానం నుంచి,  మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ దిబ్రుగఢ్‌ నుంచి బరిలో దిగారు.

కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్ ముజఫర్‌ నగర్‌ బరిలో నిలిచారు. మరో మంత్రి జితేంద్ర సింగ్ ఉధమ్‌పూర్‌ నుంచి హ్యాట్రిక్‌ కొట్టాలని యత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు అయిన భూపేంద్ర యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్‌ , కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ బికనీర్‌, మంత్రి ఎల్.మురుగన్ తమిళనాడులోని నీలగిరి నుంచి పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా నిలిచారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్‌ ప్రామాణిక్‌ బంగాల్‌లోని కూచ్‌బిహార్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version