మొత్తం 89 యాప్స్ ను తొలిగించాలన్న భారత్ ఆర్మీ…!

-

భారత ప్రజల సమాచార గోప్యత కారణంగా చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను భారతదేశ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా భారత ప్రభుత్వం భారత ఆర్మీ కి కొన్ని సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా భారత ఆర్మీ కి సంబంధించిన వ్యక్తులు టిక్ టాక్, పబ్ జి, ట్రూకాలర్, ఫేస్బుక్ లాంటి మొత్తం 89 యాప్స్ ను వారి మొబైల్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి ముఖ్యమైన కారణం దేశానికి సంబంధించిన ఎలాంటి వార్త అయినా సరే బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా చైనా కు సంబంధించిన యాప్స్ ఎక్కువగా ఉన్నాయి.

apps-on-phone

ముఖ్యంగా 2 వారాల క్రితం జరిగిన చైనా – భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా భారత ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. ఏది ఏమైనా భారత్ – చైనా ఆర్థిక పరిస్థితి పై గట్టి దెబ్బ వేసినట్లయింది. ఇకపోతే ఈ విషయాన్ని అనేక దేశాలు కూడా సమర్థించాయి. అలాగే భారత్ తో పాటు అమెరికా, రష్యా దేశాలు కూడా త్వరలోనే చైనా కు సంబంధించిన యాప్ లను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version