ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఇకపై తన కంపెనీకి చెందిన అన్ని స్మార్ట్‌వాచ్‌లను ఇండియాలోనే తయారు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే ఆ కంపెనీ గురువారం తన తొలి మేకిన్ ఇండియా స్మార్ట్‌వాచ్.. గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 4జి (అల్యూమినియం ఎడిషన్)ని విడుదల చేసింది. ఈ వాచ్ ధర రూ.28,490గా ఉంది. ఈ వాచ్ 3 కలర్ ఆప్షన్లలో వినియోగదారులకు లభిస్తోంది. క్లౌడ్ సిల్వర్, ఆక్వా బ్లాక్, పింక్ గోల్డ్ కలర్లలో ఈ వాచ్‌ను జూలై 11వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
ఈ వాచ్‌పై వినియోగదారులు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ విధానంలో ఈ వాచ్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. జూలై 31వ తేదీ వరకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌లో బాగంగా ఇకపై స్మార్ట్‌వాచ్‌లను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తామని తెలిపారు. మొత్తం 18 రకాల మోడల్స్‌కు చెందిన స్మార్ట్‌వాచ్‌లను భారత్‌లో ఉత్పత్తి చేస్తామన్నారు. శాంసంగ్‌కు చెందిన 4జి స్మార్ట్‌వాచ్ రేంజ్‌లో 42ఎంఎం, 44ఎంఎం, 46ఎంఎం సైజుల్లో వాచ్‌లు లభిస్తున్నాయి. ఈ వాచ్‌లకు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వీటిల్లో 39 రకాల వర్కవుట్ ట్రాకర్లను అందిస్తున్నారు. అలాగే వాచ్ ఫేస్‌లను ఇందులో కస్టమైజ్ చేసుకోవచ్చు. భిన్న రకాల స్ట్రాప్‌లను ఈ వాచ్‌లకు అందిస్తున్నారు.
గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 4జి వాచ్‌లో ఇ-సిమ్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. అందువల్ల ఎయిర్‌టెల్, జియో కస్టమర్లు ఈ వాచ్‌లో ఇ-సిమ్ సేవలను పొందవచ్చు.
ఈ వాచ్‌లో 1.4 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.