సినీనటి, తమిళనాడుకు చెందిన బిజెపి నాయకురాలు ఖుష్బు సుందర్ కు కీలక బాధ్యతలు లభించాయి. ఆమెను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) సభ్యురాలిగా కేంద్రం నామినేట్ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరు నామినేట్ అయ్యారు. బిజెపి జాతీయ వర్గం సభ్యురాలు అయిన కుష్బూ తన నియామక పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీళ్లు మూడేళ్లు పదవిలో కొనసాగుతారు.
కుష్బూ 2017 లో డీఎంకే పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకొని 2020 దాకా కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా సేవలందించారు. ఆ తర్వాత కుష్బూ బిజెపిలో చేరారు. 2021 లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమెని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం నామినేట్ చేసింది. ఆమె నియామకం పై బిజెపి తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అభినందనలు తెలిపారు.
@khushsundar
Hearty Congratulations. You have always been a strong independent voice. I am sure this will empower you to effectively take up concerns & issues pertaining to welfare of women in our great nation & do your best for them. Godspeed !https://t.co/uyQjpms05s— C.R.Kesavan (@crkesavan) February 27, 2023