కుటుంబాన్ని కాపాడుకునేందుకు చిరుతను ఢీకొట్టాడు..!

-

జూలోని పులిని చూడలంటేనే కొందరికి భయమేస్తోంది. అటుగా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా పులి అడ్డం వస్తే అంతే మన పని అయిపోయిందనుకొని దేవుడిపై భారం వేస్తారు. కానీ.. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏకంగా చిరుతతో పోరాడి దాన్ని మట్టుబెట్టేశాడు. అతడిని చిరుత తీవ్రంగా గాయపరిచినా ఏమాత్రం వెనిక్క తగ్గకుండా భీకరమైన పోరాటం చేసి ఎట్టకేలకు దాన్ని అంతమోందించిన ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.

 

చేతికందిన కర్రలతో దాడి..

హాసన జిల్లా అరసికెరె నియోజకవర్గంలోని బైరగొండనహళ్లి కి చెందిన రాజగోపాల్‌ బైక్‌పై భార్య, కుమార్తెను తీసుకొని తన గ్రామ కొండ ప్రాంతంలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా రాజగోపాల్‌ బైక్‌ ముందు చిరుతు వచ్చి నిలబడింది. చిరుతను చూసని రాజగోపాల్‌ సడెన్‌ బ్రెక్‌ వేయడంతో భార్య, కుమార్తె కిందపడిపోయారు. ఇక తాము బతకమని భార్య భావించింది. అంతలోనే చిరుత వారిపై దాడికి దిగింది. ఏమాత్రం వెనక్కి తగ్గితే ముగ్గురి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని భావించిన రాజగోపాల్‌ చిరుతపై ఎదురుదాడికి దిగాడు. రోడ్డుపక్కనున్న కర్రలు, రాళ్లతో చిరుతపై దాడి చేశాడు.

తలపై దాడి చేసినా..

ఈ క్రమంలో చిరుత ఒక్కసారిగా రాజగోపాల్‌పై దూకి తలను తీవ్రంగా గాయపరిచింది. అయినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా మరోసారి చిరుతపై దాడికి తెగబడ్డాడు. ఈ భీకరమైన దాడిలో చివరికి చిరుత ప్రాణాలు కోల్పోయింది. దీంతో ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే చిరుత కొన్ని గంటల ముందు ఇదే రహదారి మీదుగా వెళ్తున ఇద్దరిని గాయపరిచినట్లు స్థానికులు, ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. చిరుతతో పోరాడిని రాజగోపాల్‌ ధైర్యసాహాసాలను గ్రామస్థులందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం రాజగోపాల్‌ను ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version