Aam Aadmi Party leader Saurabh Bhardwaj: వారం రోజుల్లో ఢిల్లీకి కొత్త సీఎం వస్తారని తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్. తాజాగా కేజ్రీవాల్ రాజీనామా అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారమే నా దగ్గర ఉందన్నారు.
మీరు ఊహాగానాలు చేయవచ్చు. నేను చేయలేనని వెల్లడించారు. రేపు సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్. ఆ వెంటనే శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు. మాకు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలుస్తామని ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వారం రోజుల్లో కొత్త సిఎం నియామకం పూర్తి అవుతుందని చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్.