ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు వెల్లడించారు.
ప్రతిఒక్కరూ సాటి ప్రజల పట్ల ప్రేమ, దయా భావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుందని పిలుపునిచ్చారు.ఆ దిశగా మనందరం కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి నారా లోకేష్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, కరుణ, ధర్మబద్ధ జీవనాన్ని బోధించిన ప్రవక్త పుట్టిన రోజును అత్యంత పవిత్రమైనదిగా భావించి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.