జమిలి ఎన్నికలు ఓ రాజకీయ కుట్ర : అద్దంకి దయాకర్

-

జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది ఓ రాజకీయ కుట్ర అని, బీజేపీ తన మనుగడ కోసమే ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. జమిలి ఎన్నికల అంశంపై ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.జమిలి ఎన్నికలను బీజేపీ తన రాజకీయ మనుగడ కోసమే తేవాలని చూస్తోందన్నారు. ఇది ప్రాంతీయ పార్టీలను, వాటి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వాలను,ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రతిపాదనను తీసుకొచ్చిందని ఫైర్ అయ్యారు.

2026లో డీలిమిటేషన్ చట్టం వచ్చి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉన్నా దాని గురించి చర్చ చేయరని, అలాగే, బీసీ జనగణన చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నా బీసీ ప్రధానిగా ఉన్న మోడీ పట్టించుకోరని ఫైర్ అయ్యారు. కానీ, నాలుగవ సారి కేంద్రంలో ఎలా గెలవాలి? రాజకీయంగా ఎట్ల బలపడాలి? మిగతా రాజకీయ పార్టీలను ఎలా అణిచివేయాలనే దానిపై బీజేపీకి ఆసక్తి ఉంటుందని ఆరోపించారు.దీనిని రేపు జరిగే వందేళ్ల ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో కూడా చర్చకు తీసుకొస్తారని, ఇది ఓ రకంగా ప్రజలు, దేశం, ప్రాంతీయ పార్టీలపై, ప్రభుత్వాలపై చేస్తున్న కుట్రగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అద్దంకి దయాకర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version