ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలలో మొదటి నుంచి దూకుడు కనబరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం మొత్తం 250 వార్డుల్లో మెజారిటీ మార్క్ (126) ని దాటేసింది. దీంతో ఢిల్లీ మేయర్ పీఠం ఆప్ వశమైంది. బిజెపి 97 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ ఏడు సీట్లకు మాత్రమే పరిమితమైంది. 15 ఏళ్లుగా బీజేపీ చేతిలో ఉన్న ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ కైవసం చేసుకుంది.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రభావం ఈ ఎన్నికలపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఢిల్లీలోని 240 వార్డులకు డిసెంబర్ 4వ తేదీన పోలింగ్లో దాదాపు 50% ఓటింగ్ నమోదు కాగా, మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద సందడి నెలకొంది.