ఇప్పటికే షాక్ మీద షాకులు తగులుతున్న అదానీ గ్రూపునకు తాజాగా గట్టిషాక్ తగిలింది. అదానీ గ్రూప్ అనుబంధ అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) డైరెక్టర్‌గా ఉన్న సునీల్ మెహతా రాజీనామా చేశారు. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ చైర్మన్ పోస్ట్‌కు ఎంపికైనందుకు కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ వివాదం తలెత్తకుండా సునీల్ మెహతా తమ సంస్థ డైరెక్టర్ పోస్ట్‌కు రాజీనామా చేశారని అదానీ గ్రీన్ ఎనర్జీ శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
సునీల్ మెహతా తమ సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా రాజీనామా చేశారని, ఈ నెల 24 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అదానీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది. సునీల్ మెహతా కూడా తన రాజీనామాకు ఇతర కారణాలేవీ లేవని ధ్రువీకరించారు.
`ఇండస్ఇండ్ బ్యాంక్ పార్ట్‌టైం/ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైన సునీల్ మెహతా.. ఆర్బీఐ అప్రూవల్‌ను అనుసరించి కంపెనీకి సమాచారం ఇచ్చారు. ఇండస్ఇండ్ బ్యాంక్‌కు, అదానీ గ్రీన్ ఎనర్జీకి మధ్య రుణ పరపతి సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ సూచనకు అనుగుణంగా కంపెనీ నుంచి వైదొలగాలని సూచించాం` అని బీఎస్ఈ ఫైలింగ్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది.