BREAKING : మార్చి 3న మంచు మనోజ్ పెళ్లి ?

-

సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి ట్రోల్స్ ఎదుర్కోని ఏకైక నటుడిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినిమాలపరంగా.. వ్యక్తిత్వం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్.. వైవాహిక జీవితంలో మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడని చెప్పాలి. అయితే, తాజాగా మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. మార్చి 3 న పెళ్లి చేసుకోబోతున్నాడు. భూమా మౌనిక రెడ్డి తో జరిగే వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫంక్షన్ మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ కుటుంబం భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన మౌనిక రెడ్డికి గతంలో పెళ్లి జరిగి విఫలమైంది. మనోజ్ కు కూడా పెళ్లి జరిగి విడాకులకు దారి తీసింది. గత కొంత కాలంగా మనోజ్ పెళ్లి అన్నది వార్తల్లోనే ఉంటూ వస్తుంది. మనోజ్, మౌనిక కలిసి చాలాసార్లు కనిపించారు. త్వరలో శుభవార్త అనే హింటులు ఇస్తూ వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version