జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్‌-1

-

సూర్యుడి గుట్టు తేల్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవలే ఆదిత్య ఎల్1 మిషన్ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మిషన్ త్వరలోనే చివరి అంకానికి చేరుకోనుందట. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్‌-1’ జనవరి 6వ తేదీన తన గమ్యస్థానానికి చేరుకోనుందట. ఆదిత్య ఎల్‌1 జనవరి 6న ఎల్‌-1 (లగ్రాంజ్‌ పాయింట్‌-1)లోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు.

ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ ఎల్‌-1 పాయింట్‌కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్‌ను మండిస్తామని సోమనాథ్ చెప్పారు. తర్వాత ఈ వ్యోమనౌక ఎల్‌-1 కేంద్రంలో స్థిరపడుతుందని.. అది విజయవంతంగా ఆ పాయింట్‌ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్ష్యలో తిరుగుతూ ఉంటుందని వివరించారు. ఐదేళ్లపాటు భారత్‌ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించేందు ఆదిత్య ఎల్1 సేకరించనున్న సమాచారం .. సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని సోమనాథ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news