మొదటి దశ ఎన్నికల్లో 252మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

-

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 19వ తేదీన 102 లోక్‌సభ స్థానాలకు తొలి విడత పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఆయా స్థానాలకు 1625 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ – ADR సంస్థ 1,618 మంది అఫిడవిట్లను విశ్లేషించి ఓ నివేదికను విడుల చేసింది.

ఈ 102 స్థానాల్లో 42 చోట్ల ముగ్గురు లేదా అంతకుమించిన అభ్యర్థులు క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 1,618 మంది అభ్యర్థుల్లో 252 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. వారిలో 161 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయని, ఏడు మందిపై హత్యకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇక 19 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు వివరించింది. తొలి విడత ఎన్నికలు జరగనున్న 102 స్థానాలలో 42 శాతం స్థానాలు రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలని ADR అభిప్రాయపడింది. అంటే ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ముగ్గురు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంటే ఆ స్థానాన్ని రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గంగా ADR నిర్వచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version