వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్గాన్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ను వెనక్కి నెట్టి 5వ స్థానంలోకి దూసుకెళ్లింది. 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను సమం చేసింది. కాగా, ఇది ఆఫ్గాన్ కు వరుసగా మూడో విజయం. ఇంతకుముందు ఇంగ్లాండ్, పాకిస్తాన్ లపై గెలిచింది.
దీంతో పాటిస్తాన్ కు సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే… తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ ఆఫ్గనిస్తాన్ ముందు స్వల్ప లక్ష్యాన్ని 180 ఉంచింది. నబి 3 మరియు నూర్ అహ్మద్ 2 వికెట్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో పరుగులకే కుప్పకూలింది నెదర్లాండ్. అనంతరం ఆఫ్గనిస్తాన్ 31.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆఫ్ఘన్ బ్యాటింగ్ లో రహ్మత్ షా (52) మరియు హస్మతుల్లా షాహిద్ (56) లు అర్ద సెంచరీ లు చేసి విజయాన్ని అందించారు.