నిరుద్యోగులకు అలర్ట్..ఈ నెల 31 నుంచి సికింద్రాబాద్‌లో అగ్నివీర్ ర్యాలీ

-

Agniveer Recruitment Rally: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31వ తేదీ నుంచి సికింద్రాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. ఈనెల 31వ తేదీ నుంచి సికింద్రాబాద్ ఏవో సి సెంట ర్లోని జోగేంద్ర స్టేడియం లో అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించ బోతున్నారు అధికారులు.

Agniveer Recruitment Rally
Agniveer Recruitment Rally

జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్స్, ట్రేడ్ మెన్స్ పోస్టులను ఈ సందర్భంగా భర్తీ చేయబోతున్నారు. ఈ జులై 31వ తేదీన అగ్ని ర్యాలీ నిర్వహించనుండగా సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ ఈవెంట్లు కొనసాగనున్నాయి. అటు వివిధ కేటగిరీలలో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించబోతున్నారు. ఇక ఈ అగ్ని వీరు పోస్టుల భర్తీపై… AOC సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ ను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news