తెలంగాణ మహిళలకు మరో శుభవార్త అందింది. త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 తీసుకురాబోతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనలు చేశారు. రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 తీసుకురాబోతున్నారు.