Kurkure: కుర్ కురే కొనివ్వ‌లేద‌ని విడాకులు కోరింది..!

-

Agra Woman Seeks Divorce As Husband Forgets Rs 5 Kurkure Packet: ఐదు రూపాయల కురుకురే ప్యాకెట్ ఓ కాపురంలో చిచ్చు పెట్టింది. కురుకురే ప్యాకెట్ కొనియ్య నందుకు… ఓ భార్య… భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కురుకురే చిప్స్ టెస్ట్ కోసం అడిక్ట్ అయిన ఓ మహిళ… నిత్యం వాటిని తింటూ ఉండేది. అయితే ప్రతిరోజు తన భర్తను ఈ కుర్కురే ప్యాకెట్ తీసుకురమ్మని కోరేది.

Agra Woman Seeks Divorce As Husband Forgets Rs 5 Kurkure Packet

అలా రెగ్యులర్గా తన భార్య కోసం కుర్కురే ప్యాకెట్ తీసుకువెళ్లేవాడు ఆమె భర్త. అయితే ఒక రోజు భర్త ఆ కుర్కురే ప్యాకెట్ తీసుకువెళ్లడం మర్చిపోయాడు. దీంతో పెద్ద రచ్చ రచ్చ చేసింది అతని భార్య. కోపంతో పుట్టింటికి కూడా వెళ్ళింది ఆ మహిళ. అనంతరం తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు కూడా డిసైడ్ అయింది. దానికోసం అధికారులను ఆశ్రయించింది ఆ మహిళ. ఆగ్రాలోని షాహ్ గంజి పోలీసులు ఈ దంపతుల మధ్య సయోధ్య కుదుర్చు ఎందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఆ మహిళ వినడం లేదు. మరి ఈ సంఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news