NDA కి గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే..!

-

ఎన్‌డీఏ కూటమికి అన్నాడీఎంకె గుడ్ బై చెప్పింది. సోమవారం జరిగిన ఏఐఏడీఎంకే కార్యవర్గ సమావేశంలో  ఈ మేరకు ఏకగీవ్రంగా తీర్మానం చేశారు.   గత కొంతకాలంగా  రాష్ట్రంలో బీజేపీ నేతలు అన్నాడిఎంకె నేతలపై  విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తుంది.  ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకి రావడానికి బీజేపీ నేతల వైఖరే కారణమని ఎఐఏడీఎంకే నేతలు ప్రకటించారు.

బీజేపీతో పొత్తుపై  చర్చించేందుకు  ఎఐఏడీఎంకె  ప్రధాన కార్యదర్శి కె. పళనిస్వామి అధ్యక్షతన ఆయా జిల్లాల్లోని పార్టీ కార్యదర్శులు,  ఎమ్మెల్యేలు,ఇతర కీలక నేతలతో  సోమవారం ఆ పార్టీ సమావేశం జరిగింది.  అన్నాడీఎంకెపై బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ  ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేయడాన్ని  అన్నాడీఎంకే సమావేశం తప్పుబట్టింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని అన్నాడీఎంకె సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత  ఆ పార్టీ కార్యాలయం వెలుపల సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై  అన్నాడీఎంకే నేతలు మండిపడ్డారు. ఈ విషయమై బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ ఆరోపించింది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఆ పార్టీ నేతలు  శుక్రవారంనాడు జేపీ నడ్డా,పీయూష్ గోయల్ ని కలిశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వివరించారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version