పార్టీ విలీనంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరుసగా బెంగళూరు, ఢిల్లీ వేదికగా సమావేశాలు కావడం, మంతనాలు జరపడం.. అదిగో, ఇదిగో విలీనం అంటూ హడావుడి జరగడం తప్పితే ఇంతవరకూ ఈ ప్రక్రియలో కదలిక లేదు. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుండటం.. మరోవైపు పార్టీలోని నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్న తరుణంలో షర్మిల కీలక ప్రకటన చేశారు.

పార్టీ విలీనంపై సెప్టెంబర్ 30వ తేదీ లోపు నిర్ణయం తీసుకుంటామని వైఎస్ షర్మిల అన్నారు. ఇతర పార్టీలో విలీనం చేయని పక్షంలో తాము ఒంటరిగా బరిలోకి దిగుతామన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో సోమవారం ఆ పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. అక్టోబర్ రెండో వారం నుంచి షర్మిల ప్రజల మధ్యలో ఉండాలని కార్యాచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది. విలీనం అయినప్పటికీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version