ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తుండగా రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్‌

-

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతో క్షణాల్లోనే వెనక్కి మళ్లిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. హాల్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్‌ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఈ విమానం టేకాఫ్‌ అయిన తర్వాత ముందు వైపునున్న నోస్‌ ల్యాండింగ్‌ గేర్‌ రీట్రాక్ట్‌ అవలేదు. విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. హాల్‌ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాలనుకున్నారు. అయితే ఆ సమయంలో రన్‌వేపై నీరు నిలవడంతో.. ఆ నీటిలోనే విమానం ముందుకెళ్లింది. అప్పటికే నోస్‌ ల్యాండింగ్‌ గేర్‌ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. విమానం ముందు భాగం రన్‌వేను తాకి కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version