యూట్యూబ్… వాడకం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ ద్వారా కోట్లల్లో డబ్బులు సంపాదించిన వారు కూడా ఉన్నారు. మారుమూల గ్రామంలో ఉండి కూడా… డబ్బులు సంపాదిస్తున్నారు యూట్యూబర్లు. అయితే అలాంటి యూట్యూబర్లకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి యూట్యూబ్ లో కొత్త రూల్స్ రాబోతున్నాయి.

యూట్యూబ్ ఇవాల్టి (జూలై 15) నుంచి తన మానిటైజేషన్ విధానాన్ని అప్‌డేట్ చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రామాణికం కాని కంటెంట్‌కు సంబంధించిన యాడ్ ఆదాయం తగ్గుతుంది. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్‌లో భాగమయ్యేందుకు ఛానెల్‌కు 1000 కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లు, 12 నెలల్లో 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా 90 రోజుల్లో 1 కోటి షార్ట్స్ వ్యూస్ ఉండాలి. స్పామ్, AI కంటెంట్‌ను తగ్గించడానికి ఈ అప్‌డేట్‌ను తీసుకువస్తోంది.