తెలంగాణలో విషాదం నెలకొంది. కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి చెందాడు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ (45) మృతి చెందాడు. ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్ లు లభ్యం అయ్యాయి. మెదక్- హైదరాబాద్ రోడ్డు పక్కన అదుపు తప్పినట్టు కారులో పడి అనిల్ మృత దేహం ఉంది.

మొదట రోడ్డు ప్రమాదంగా భావించారు పోలీసులు. అయితే.. ఘటనా స్థలంలో బుల్లెట్లు లభ్యం కావడంతో పాటు, అనిల్ ఒంటిపై కూడా బుల్లెట్ గాయాలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఇది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.