నేడు ఆకాశంలో ఓ అద్భుతం చోటు చేసుకోనుంది. ఒకే నెలలో అంటే ఆగస్టు మాసంలో రెండు సూపర్ మూన్ లు మనకు కనిపించనున్నాయి. ఇందులో భాగంగానే… ఇవాళ మొదటి సూపర్ మూన్ దర్శనమివ్వనుంది. ఇదే నెల 30న బ్లూ మూన్ కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు.
ఇక ఇవాళ అర్థరాత్రి 12.01 గంటలకు పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు చంద్రడు. అలాగే.. మళ్లీ 30న రెండో పౌర్ణమి సందర్భంగా కనిపించనుంది బ్లూ బూన్. ఇలాంటి ఘటన 2037 వరకు మళ్లీ జరగదని శాస్ట్రవేత్తలు వెల్లడించారు. ఇలాంటి సంఘటన జరుగడం పెద్ద వింత అని చెబుతున్నారు శాస్ట్రవేత్తలు.