జమ్మూ కశ్మీర్ లో కాషాయం జెండా ఎగరేసేందుకు బిజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.. ప్రదాని మోడీతో పాటు.. అమిత్ షా కీలక నేతలు విసృతంగా ప్రచారం నిర్వహించారు.. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిశాయి.. అక్టోబర్ 1న మలి విడత ఎన్నికలు జరిగాయి.. ఈ నేపథ్యంలో ఓ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. నేరుగా హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో అక్కడ గెలుపు మీద బిజేపీ గంపెడు ఆశలు పెట్టుకుంది..
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో, ముఖ్యంగా బషోలీ అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోకజకవర్గంలో పాగా వేసేందుకు బిజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది.. అన్నివర్గాల ప్రజలను దగ్గరయే ప్రయత్నం చేసింది.. గత కొనేళ్లుగా ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ నాయకుడైనా చౌదరి లాల్ సింగ్ ఇక్కడ వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు.చౌదరి లాల్ సింగ్ మూడుసార్లు ఎమ్మెల్యే మరియు రెండుసార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. మరోసారి విజయం సాధించేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ గెలిచి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది..
ఈ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు బిజేపీ మొదటి నుంచే ఒక పక్కా ప్లాన్ తో బరిలోకి దిగింది.. చౌదరి లాల్ సింగ్ వరుస విజయాలకు బ్రేక్ వేసేందుకు.. ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన జిల్లా అధ్యక్షుడు దర్శన్ కుమార్‌ను ఇక్కడ నుంచి బిజేపీ రంగంలోకి దించింది. సమర్దవంతమైన నేతగా ఉన్న దర్శన్ కుమార్ కు అండగా హోం మంత్రి అమిత్ షా , రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో సింగ్, అండోత్రా సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.. కాంగ్రెస్ అభ్యర్థి చౌదరి లాల్ సింగ్ వర్గానికి చెందిన వారు కావడం, అతని భార్య అండోత్రాకు చెందిన వారు కావడంతో అతనికి కాస్త ప్లస్ అయ్యే అవకాశముందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి..
బీజేపీ అభ్యర్థులను మార్చి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.. బషోలీ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరాలని గట్టి పట్టుదలతో ప్రచారం చేశారు.. ఎక్కువ శాతం పోల్ అయితే అది బిజేపికి లాభిస్తుందని.. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని కమల నాధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు..