అభిమానులకు శుభవార్త.. కాన్పూర్‌లో నేటి మ్యాచ్‌కు తొలగిన వర్షం అడ్డంకి!

-

భారత్-బంగ్లాదేశ మధ్య రెండో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. నేడు (మంగళవారం) ఫైనల్ డే మ్యాచ్ ఉంది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో తుది రోజు ఆట మాత్రమే మిగిలింది. వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే మ్యాచ్ కొనసాగింది. ఆట మధ్యలో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది.ఆ తర్వాత ఎడతెరిపిలేకుండా పడటంతో మైదానం చిత్తడిగా మారింది. దీంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులుగా ఉంది.

రెండు, మూడో రోజు వర్షం వలన మైదానం సహకరించక మ్యాచ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.కాగా, నాలుగవ రోజైన సోమవారం మ్యాచ్ ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 26/2 స్కోర్ చేసింది. బంగ్లా నేడు తొలి ఇన్నింగ్స్ 107/3తో ప్రారంభించి, 233 పరుగులకు ఆలౌటయింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన టీంఇండియా ధాటిగా ఆడుతూ.. 285/9 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి 72, రోహిత్ 23, గిల్ 39, పంత్ 9 పరుగులు చేశారు. అయితే, నేటి మ్యాచుకు వరుణుడి అడ్డంకి తొలగినట్లు సమాచారం. దీంతో మ్యాచ్‌కు ఎటువంటి ఆటంకం కలుగదు. ఒకవేళ బంగ్లా ఛేదనలో వెనుకబడితే రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version