నిఖితకు మా కంపెనీలో ఉద్యోగమిస్తాం.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

-

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన ఎప్పటికప్పుడు న్యూస్ ఫాలో అవుతూ తనకు నచ్చిన విషయాలపై స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా క్రియేటివిటీ, టాలెంట్ ను ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ  పోస్టు పెట్టారు.

అమెజాన్‌ వర్చువల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ ‘అలెక్సా’ సాయంతో కోతుల బారి నుంచి తనను, మేనకోడల్ని రక్షించుకున్న 13 ఏళ్ల బాలిక నిఖితకు తాను ఉద్యోగం ఇస్తానని ఆనంద్ మహీంద్రా మాటిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానానికి మనం బానిసలు అవుతామా, లేక మాస్టర్లుగానే ఉంటామా అనేది ఈ సాంకేతిక యుగంలో మన ముందున్న పెద్ద ప్రశ్న అని ఆయన అన్నారు. కానీ ఈ బాలిక సమయస్ఫూర్తిని చూశాక సాంకేతికత ఎప్పటికీ మానవుడి ఆజ్ఞలను పాటించేదే అన్న ఆశాభావాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. నిఖిత వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోందన్న ఆయన.. తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే తాము మహీంద్రా రైజ్‌లో చేరమని ఆహ్వానిస్తున్నాము అని పోస్టులో పేర్కొన్నారు. మహీంద్రా పోస్టు వైరలవ్వడంతో నెటిజన్లు ఆ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news