మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో జీవితాలు మారిపోనున్నాయా..?

-

మోదీ సర్కార్ వివిధ రకాల స్కీం లతో ప్రజలని ఆదుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద మార్పు తీసుకరానుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీధి వ్యాపారుల జీవితాలకి వెలుగులు ఇవ్వాలని శుభవార్త చెబుతోంది మోదీ ప్రభత్వం. ఇందుకు గాను నేడు 3 లక్షల మంది వీధి వ్యాపారులకు సాయం అందించనుంది. పీఎం స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వానిధి) కింద నేడు 3 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేయనున్నారు.

pm-swanidhi-yojana

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడనున్నారు. ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో వీధి వ్యాపారస్తుల వ్యాపారం మొత్తం కూలిపోయింది. అయితే మోదీ ప్రభుత్వం తిరిగి వాళ్ళు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా పీఎం స్వానిధి పథకం తీసుకు వచ్చింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 5,57,000 దరఖాస్తులు అమ్మకందారుల నుంచి సేకరించింది. ఈ పధకం కింద వ్యాపారాలుకి సాయం అందితే వీధి వ్యాపారులు తమ పనిని ఎటువంటి ఆలస్యం చేయకుండా తిరిగి ప్రారంభించగలుగుతారు.

ఈ స్కీమ్ కు ఎవరు అర్హులు అన్న విషయానికి వస్తే… రోడ్ సైడ్ బండి లేదా వీధి – రహదారిపై దుకాణాలను నడిపే వారికి, పండ్లు – కూరగాయలు, లాండ్రీ, సెలూన్, పాన్ షాపులు వాళ్ళు కూడా అర్హులే. వీధి వ్యాపారుల కోసం ప్రారంభించిన ఈ పథకం కోసం రూ. 5000 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ రుణం కోసం మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ప్రతి వీధి విక్రేత రూ.10,000 వరకు రుణం తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని వీధి విక్రేతల ఒక సంవత్సరంలోపు వాయిదాలలో తిరిగి ఇవ్వవచ్చు. అలానే ఏ హామీ అవసరం లేదు. రుణం సకాలంలో తిరిగి చెల్లించే వారికి 7% వార్షిక వడ్డీ రాయితీ కూడా ఇవ్వబడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version