తమిళనాడులో దారుణం.. ఏనుగు నోట్లో పేలిన నాటు బాంబు

-

తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటు బాంబు పేలింది. దీంతో ఏమి తినలేక ఆకలితో అలమటించి  ప్రాణాలను వదిలింది. అడవి పందులు తమ పొలాల్లోకి రాకుండా నిరోధించడానికి అవుత్తుకై అని పిలిచే బాంబును ఇక్కడి స్థానికులు పండ్లు , కూరగాయాలలో పెట్టి వుంచుతారు. ఏదైనా జంతువు దానిని కొరికినప్పుడు అది పేలి.. జంతువు నోటికి తీవ్ర గాయమవుతుంది. ఈ నేపథ్యంలో తడగాం అటవీ రేంజ్‌లోని ఇటుక బట్టీ సమీపంలో ఏనుగు సంచరిస్తోందని స్థానికులు అటవీ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

సమాచారం అందుకున్న అధికారులు, పశువైద్య బృందం ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయంతో బాధపడుతున్న ఏనుగుకు ఇంట్రావీనస్ మెడిసన్, గ్లూకోజ్ అందించారు. ఈ క్రమంలో నిషేధిత ‘‘అవుట్టుకై’’ అనే నాటు బాంబును ఏనుగు కొరికినట్లుగా పశువైద్య బృందం గుర్తించింది. ఇటీవలే కేరళ నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి బాధిత ఏనుగు ప్రవేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏనుగు ఈ బాంబును ఎక్కడ కొరికిందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version