భార్య వేధింపులు తాళలేక బెంగళూరు టెకీ ఆత్మ**హత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన నాలుగేళ్ల మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని ఇటీవల అతుల్ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. బాలుడు తన తల్లి వద్దనే ఉంటాడని తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తన మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని ఇటీవల అతుల్ తల్లి సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ బీ.వీ. నాగరత్న, జస్టిస్ ఎస్.సీ. శర్మ వీడియో కాల్ ద్వారా బాలుడిని చూశారు. చిన్నారితో మాట్లాడారు. అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ బాలుడు తన తల్లి వద్దనే ఉంటారని తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. కేసుకు సంబంధించి మరిన్నీ ఆధారాలు సమర్పించేందుకు మరోవారం గడువు కావాలని బాలుడి నాన్నమ్మ తరపు న్యాయవాది కోరగా.. న్యాయస్థానం తిరస్కరించింది.