Meg Lanning: ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటివరకు ఐదు ఐసీసీ ట్రోఫీలు గెలిచి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న ఆసీస్ మహిళల టీం కెప్టెన్ మెగ్ లానింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా టీం ఎక్కువ సేవలు అందించిన ఆమె…. తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు చేరుకుంది. ఇప్పుడు సడన్ గా ఆమె ఈ నిర్ణయం ప్రకటించడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోయారు.
ఆమె తన కెరీర్ లో అన్ని ఫార్మాట్లో కలిపి 241 మ్యాచ్లు ఆడి 8352 పరుగులు చేసింది. తన నిర్ణయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది. ఇలా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం చాలా కఠినమైందని, కానీ ఇదే దానికి తగిన సమయం అని ఫీల్ అవుతున్నానని ఆమె చెప్పింది. కాగా 2010లో కివీస్ తో జరిగిన టి20 మ్యాచ్ లో లానింగ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2014లో 21 ఏళ్ల వయసులో టీం కెప్టెన్ గా నిలిచింది.