రన్యారావుకు షాక్.. స్మగ్లింగ్ కేసులో బెయిల్‌ నిరాకరణ

-

బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బెంగళూరులోని సెషన్స్‌ కోర్టు .. బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న రన్యారావును అధికారులు విచారిస్తున్నారు.  బెయిల్‌ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

ఇక ఇదే కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గోల్డ్ డీలర్ గా వ్యవహరించిన సాహిల్ జైన్.. అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు రన్యారావుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో రెండు సార్లు ఆమెకు సాయం చేసిన ఆధారాలను డీఆర్ఐ అధికారులు సేకరించారు. దుబాయ్‌ నుంచి అక్రమంగా 14 కేజీలకు పైగా బంగారం తరలిస్తుండగా.. ఎయిర్‌పోర్టులో రన్యారావును అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అనంతరం ఆమె నివాసంలో తనిఖీలు చేయగా భారీగా బంగారం, నగదు లభించింది. ఇక ఈ కేసులో రన్యారావుకు పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా సాయం అందినట్లు డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు పలువురు రాజకీయ నేతలు ఆమెకు అండగా ఉన్నట్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news