తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరిరోజున వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. విమర్శలు, ప్రతివిమర్శలతో శాసనసభ హీటెక్కింది. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ.. ఎవరేమన్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని.. తెలంగాణ బూతుపిత రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
‘అద్దెలు చెల్లించకపోవడంతో గురుకుల భవనాలకు తాళాలు వేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే మేం కూడా చెల్లించాం. ఈ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది 11 వేల ఉద్యోగాలు మాత్రమే. మేం పరీక్షలు నిర్వహించిన వాటికే వీళ్లు నియామకపత్రాలు ఇచ్చారు. గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామన్నారు.. చేయలేదు. కోటి మంది మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్నారు..ఇవ్వలేదు. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం కోసం ఎదురుచూస్తున్నారు. దళితబంధు, గిరిజనబంధు కింద రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్నారు..ఇవ్వాలి.’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.