‘సిగ్నల్ జంప్ చేశా ఫైన్ కట్టొచ్చా’ అంటూ ట్వీట్.. ట్రాఫిక్ పోలీసుల రిప్లై ఏంటంటే..?

-

చాలా మంది వాహనదారులు సిగ్నల్ జంప్ చేస్తూ, చలానాలు కట్టకుండా తప్పించుకుంటూ, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ.. ఇలా రకరకాల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు. కానీ అందరిలా లైట్ తీసుకోలేదు. అత్యవసర పరిస్థితుల్లో అయినా.. తాను చేసింది తప్పే అని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే..

 

“ప్రియమైన బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులారా.. శాంతినగర్ బస్టాండ్ దగ్గర నిన్న పొరపాటున ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశా. నేను స్వచ్ఛందంగా ఫైన్​ కట్టేయొచ్చా?” అంటూ పోలీసులకు ఓ వ్యక్తి చేసిన ట్వీట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్​కు పోలీసులు ఇచ్చిన జవాబు కూడా చర్చనీయాంశమైంది.

బాలకృష్ణ బిర్లా అనే వ్యక్తి బెంగళూరులో ఉంటారు. ఏదో పనిపై ఈనెల 27న తన వాహనంలో బయటకు వెళ్లారు. హడావుడిలో చూసుకోకుండా శాంతినగర్​ బస్టాండ్​ దగ్గర సిగ్నల్ జంప్ చేశారు. కానీ.. తప్పు చేశానన్న భావన ఆయన్ను వెంటాడింది. ఇంటికి వచ్చినా ప్రశాంతత లేదు. అందుకే ఈ నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నారు బాలకృష్ణ బిర్లా.

బుధవారం బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల అధికారిక హ్యాండిల్​ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు బాలకృష్ణ. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ నేరానికి పాల్పడినందుకు స్వచ్ఛందంగా జరిమానా కట్టేస్తానని ముందుకొచ్చారు. గురువారం ఉదయం ఈ బిర్లా ట్వీట్​కు స్పందించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. “చలానా వచ్చాక మీరు ఫైన్ కట్టేయొచ్చు” అని రిప్లై ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version