మార్చి నెలలోని 2024 బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల మాదిరి 2024 మార్చి​​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను విడుదల చేసింది. దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 14 రోజుల పాటు సెలవులను ప్రకటించింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ హాలిడేస్ కూడా ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది.

bank-holidays

2024 మార్చి​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే

  • మార్చి 1 (శుక్రవారం) : చాప్‌చార్​ కుట్​ (మిజోరాంలోని బ్యాంకులకు సెలవు)
  • మార్చి 3 (ఆదివారం)
  • మార్చి 8 (శుక్రవారం) : మహాశివరాత్రి (దిల్లీ, బిహార్​, రాజస్థాన్​, తమిళనాడు, త్రిపుర, బంగాల్​, మిజోరాం, అసోం, మణిపుర్​, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్​, ఇటానగర్​, గోవా రాష్ట్రాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు)
  • మార్చి 9 (రెండో శనివారం)
  • మార్చి 10 (ఆదివారం)
  • మార్చి 17 (ఆదివారం)
  • మార్చి 22 (శుక్రవారం) : బిహార్​ దివస్​ (బిహార్​లోని బ్యాంకులకు సెలవు)
  • మార్చి 23 (నాల్గో శనివారం)
  • మార్చి 24 (ఆదివారం)
  • మార్చి 25 (సోమవారం) : హోలీ (కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపుర్​, కేరళ, నాగాలాండ్​, బిహార్​, శ్రీనగర్​ మినహాయించి మిగతా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
  • మార్చి 26 (మంగళవారం) : యోసాంగ్​ వేడుక/ హోలీ (ఒడిశా, మణిపుర్​, బిహార్​లోని బ్యాంకులకు సెలవు)
  • మార్చి 27 (బుధవారం) : హోలీ (బిహార్​లోని బ్యాంకులకు సెలవు)
  • మార్చి 29 (శుక్రవారం) : గుడ్​ ఫ్రైడే (త్రిపుర, అసోం, రాజస్థాన్​, జమ్ముకశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు)

Read more RELATED
Recommended to you

Latest news